రాజమహేంద్రవరం లో తండేల్ యూనిట్ సందడి
గోదారోళ్ళు మర్యాదలు మరువలేము
హీరో అక్కినేని నాగ చైతన్య
న్యూస్ తెలుగు/రాజమహేంద్రవరం: గోదావరిజిల్లా వాసుల మర్యాద మరువలేనిదని యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య అన్నారు. ఆదివారం అప్సర ధియేటర్ మొదటి ఆట మధ్యలో తండేల్ చిత్రయూనిట్ సందడి చేసింది. హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీవాసు,హాస్యనటుడు మహేష్‌లు ప్రేక్షకులతో మాట్లాడారు. సందడి చేశారు. హీరో నాగచైతన్య మాట్లాడుతూ తండేల్ సినిమాను బంపర్‌హిట్ చేసిన అక్కినేని అభిమానులతో పాటు, ప్రేక్షకగోదావరిజిల్లాల వాసుల మర్యాద మరువలేనిదని అన్నారు. అక్కినేని అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా రిలీజైన రెండురోజులకే ప్రేక్షకులను కలవాలన్న ఆకాంక్షతోనే ఇక్కడకు రావడం జరిగిందన్నారు. దుళ్ల కొట్టేద్ధామా అంటూ సినిమాలోని డైలాగ్‌లతో నాగచైతన్య ప్రేక్షకులను అలరించారు. దర్శకుడు చందూ మొండేటి మాట్లాడుతూ గోదావరిజిల్లాల ప్రజలు ఆదరణ మరువలేనిదన్నారు. నిర్మాత బన్నీవాసు మాట్లాడుతూ దర్శకుడు,తాను గోదావరిజిల్లా వాసులమేనని, సినిమాను సూపర్ బంపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. హాస్యనటుడు మహేష్ మాట్లాడుతూ అల్లు అర్జున్ కు పుష్ప,రామ్‌చరణ్‌కు రంగస్థలం, నాగచైతన్యకు తండేల్ సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. అక్కినేని నాగార్జున,నాగచైతన్య,అఖిల్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాటం రజనీకాంత్,అభిమానులు నాగచైతన్యకు భారీగజమాల వేశారు.ఎటువంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సెంట్రల్‌జోన్ డీఎస్పీ రమేష్‌బాబు ఆధ్వర్యంలో త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు నేతృత్వంలో అప్సరధియేటర్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ మేనేజర్ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో విజయ య.(Story : రాజమహేంద్రవరం లో తండేల్ యూనిట్ సందడి)