భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు
న్యూస్ తెలుగు/ సాలూరు : భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి పర్వదినము సాలూరు పట్టణంలో జరిగింది. పట్టణంలో వేంచేసియున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం కుంకు వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం. వైకుంఠపు వీధిలో ఉన్న విష్ణుమూర్తి ఆలయం. పెద్ద కోమటి పేటలో ఉన్న శ్రీ సీత రామ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బి నారాయణ చార్యులు. బి ఉదయభాస్కర్ మాట్లాడుతూ భక్తుల ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామివారికి సుప్రభాత సేవ నవనీత హారతి మొదలుకొని అష్టోత్తర శతనామ అర్చన నాలుగుసార్లు చేయడం జరిగిందని తెలిపారు. భక్తులు ఆలయ ధర్మకర్తల మండల సభ్యుల తో విశేష హారతి స్వామివారికి ఇవ్వడం జరిగిందని అన్నారు. భక్తులకు ఉచిత లడ్డు పులిహారి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని తెలిపారు. భీష్మ ఏకాదశి రోజున ఆ వెంకటేశ్వర స్వామివారిలను దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు భక్తులకు ప్రసాదించాలని ఆశీర్వాదం ఇచ్చామని తెలిపారు. (Story : భక్తిశ్రద్ధలతో భీష్మ ఏకాదశి ప్రత్యేక పూజలు)