కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి పట్టణంలోని 22వ వార్డు బాలాజీ నగర్ లో గల కుట్టుశిక్షణ కేంద్రాన్ని శనివారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి సందర్శుంచారు. ఈ సందర్భంగా ఆయన నిర్వాహకురాలు హసీనాతో శిక్షణ కేంద్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రామానంద తీర్థ స్వచ్ఛంద సంస్థ వారు ఈ కేంద్రంను ఏర్పాటు చేశారని తదనంతరం తామే కొనసాగిస్తూ నేటి వరకు 2 నుంచి 3వేల మంది మహిళలకు కుట్టు శిక్షణను ఇచ్చామని ప్రస్తుతం ఈ కేంద్రంలో 30 కుట్టుమిషన్లు ఉన్నాయని ఇందులోను ఆత్యాధునికంగా లోడింగ్, కాలర్, కాజా, బటన్, కుట్లను కుట్టేందుకు సైతం మిషన్లు ఉన్నాయని ఆమె తెలిపారు ప్రస్తుతం రెడీమేడ్ దుస్తులకు దీటుగా తాము కూడా డ్రస్సులు కుడుతున్నామని తమకు ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండేలా చూడాలని వారు ఎమ్మెల్యే ని కోరారు. ఇందుకు సానుకులంగా స్పందించిన ఎమ్మెల్యే కొత్త శిక్షణ కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని మహిళలకు హామీ ఇచ్చారు. (Story : కుట్టుశిక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మెల్యే)