Homeవార్తలుతెలంగాణమహిళలు న్యాయం కొరకు భరోసా కేంద్రం అండగా ఉంటుంది

మహిళలు న్యాయం కొరకు భరోసా కేంద్రం అండగా ఉంటుంది

మహిళలు న్యాయం కొరకు భరోసా కేంద్రం అండగా ఉంటుంది

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : సమాజంలో వేధింపులకు గురైన అమ్మాయిలు, మహిళలు న్యాయం కొరకు ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని సంప్రదించాలి అనే సందిగ్ధం లేకుండా భరోసా కేంద్రం అండగా ఉంటుందని జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. వనపర్తి జిల్లాలో భరోసా కేంద్రం ఏర్పాటు చేసి సంవత్సర కాలం పూర్తి అయిన సందర్భంగా గురువారం ఉదయం పట్టణంలోని ఆర్టీసీ కాలనిలో ఉన్న భరోసా కేంద్రంలో జిల్లా ఎస్పీ రావుల గిరిధర్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్ తో కలిసి భరోసా కేంద్రంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ తెలిసి తెలియని వయసులో ఉన్న అమ్మాయిలు కావచ్చు మహిళలు కావచ్చు సమాజంలో లైంగిక వేదింపులు లేదా బాల్య వివాహాలు, గృహ హింసకు గురి అయితే భరోసా 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్, 100 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్యాయానికి గురైన వారి వివరాలు గోప్యంగా ఉంచుతూ సత్వర న్యాయం, ఆర్థిక, విద్యా సహకారాలు అందించేందుకు భరోసా కేంద్రం పనిచేస్తుందన్నారు. భరోసా కేంద్రంలో శిక్షణ పొందిన మహిళలు ఉంటారని, పోలీస్ శాఖ, న్యాయ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి బాధితులకు న్యాయం చేకూర్చడం జరుగుతుందన్నారు.
భరోసా ఏర్పాటు చేసిన తర్వాత 43 కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయడం జరిగిందన్నారు. 2024 సంవత్సరంలో జిల్లాలో 11 బాల్య వివాహాల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
బాల్య వివాహం చేయడం చట్ట విరుద్ధమని, ఎవరైనా బాల్య వివాహాం చేసేందుకు ప్రయత్నం చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా బాల్య వివాహంలో భాగస్వాములైన వారిని సైతం ఉపేక్షించబోమని చెప్పారు.
సంవత్సర కాలంలో అమ్మాయిలు, మహిళలకు అండగా ఉండి మంచి భరోసా కల్పించినందుకు భరోసా కేంద్రం సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడుతూ బాధిత అమ్మాయిలకు, మహిళలకు వైద్య పరంగా, న్యాయ సేవా పరంగా, విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ నుంచి కొంత ఆర్థిక సహాయం చేస్తూ భరోసా కేంద్రం అండగా నిలుస్తుందని కొనియాడారు.
సంవత్సర కాలములో మంచి ఫలితాలు సాధించినందుకు సిబ్బందిని అభినందించారు. బాధిత అమ్మాయిలు, మహిళలకు అండగా ఉంటూ వారిలో నమ్మకాన్ని కల్పించి తిరిగి తన దైనందిన జీవన శైలిలో జీవించే విధంగా భరోసా కేంద్రం పనిచేస్తుందన్నారు.
అంతే కాకుండా భరోసా కేంద్రం సిబ్బంది విద్యాలయాలకు వెళ్లి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ల పై అమ్మాయిలకు అవగాహన కల్పించడం, బాధితులు మానసిక క్షోభకు గురి కాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి కేసులు పెట్టే విధంగా వారికి ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుందన్నారు. మంచి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు .
అనంతరం విక్టిమ్ అసిస్టెంట్ ఫండ్ నుంచి అయిదు మంది బాధితులకు 36 వేల రూపాయల ఆర్థిక సహయం చెక్కులను అందజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, డిఎస్పీ వేంకటేశ్వర రావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, భరోసా కోఆర్డినేటర్ శిరీష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. (Story : మహిళలు న్యాయం కొరకు భరోసా కేంద్రం అండగా ఉంటుంది)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics