శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు
న్యూస్ తెలుగు / వినుకొండ : వినుకొండలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ఆలయ హుండీ లెక్కించారు. ఈ కార్యక్రమానికి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ దేవాదాయ శాఖ తిరుపతి వారు ఆదేశాల అనుసారం జిల్లా దేవాదాయ శాఖ అధికారి పల్నాడు జిల్లా జి ఏ వి. శ్రీనివాస్ ,ఇన్స్పెక్టర్ నరసరావుపేట కార్యనిర్వహణాధికారి కే. హనుమంతరావు, మరియు అర్చక స్వాములు వి. నరసింహచార్యులు, ఎస్. శ్రావణ కుమార్, మరియు ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు రెడ్డి. బంగారయ్య, అచ్యుత. కృష్ణ సుబ్బారావు, కాళ్ళ. రామకోటేశ్వరరావు, మహాదేవ, జమున ఇందుమతి, మరియు భక్తులు సమక్షంలో కుండీ తెరవగా ఒక సంవత్సర ఏడు నెలలకు గాను హుండీ ఆదాయము 5 లక్షల 39వేల 430 రూపాయలు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు. (Story : శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు)