జిల్లాలో నవజాత శిశువుల మరణాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి
న్యూస్‌తెలుగు/వనపర్తి :నవజాత శిశువుల మరణాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ తో కలిసి మంగళవారం వైద్యశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 2024 లో జిల్లాలో నవజాత శిశు మరణాలు సంభవించిన నాలుగు కేసులపై సంబంధిత పీహెచ్సీ వైద్యులు, బాధితులతో వెబ్ ఎక్స్ ద్వారా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరణాల గల కారణాలను వైద్యులు తెలపగా, బాధితులతో కూడా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. నాలుగు కేసుల్లోనూ ప్రధానంగా శ్వాస సంబంధిత, నెలలు నిండకముందే జన్మించడం వంటి సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలుపగా, దానికి పరిష్కారానికి కావాల్సిన వెంటిలేటర్స్ సహా ఇతర సామాగ్రిని సమకూర్చేందుకు చర్యలు ప్రారంభించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నవజాత శిశువుల మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో డెలివరీలు చేయడంతోపాటు ఆ తర్వాత శిశువు పరిస్థితులపై కొద్దిరోజులు ఫాలోఅప్ కూడా చేయాలన్నారు. శిశువులకు వైద్య పరీక్షలు చేయడంతో పాటు, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని తల్లిదండ్రులకు సూచించారు. ముఖ్యముగా చిన్నపిల్లలలో పుట్టగానే శ్వాస ఆడక పోవడం, శరీరం ఉష్ణోగ్రతల సక్రమంగా ఉండకపోవడము, పోషకాహారం లోపం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యరోగ్య శాఖాధికారి శ్రీనివాసులు, జిటిఏ సుపరిండెంట్ రంగారావు, గైనకాలజీ విభాగ నిపుణులు కిరణ్మయి, జిల్లా సంక్షేమ శాఖ అధికారిని సుధారాణి, డి సి పి ఓ రాంబాబు, వైద్యధికారులు సాయినాథ్ రెడ్డి, ప్రోగ్రామింగ్ అధికారులు, మెడికల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లాలో నవజాత శిశువుల మరణాలు అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలి)