ఫిబ్రవరి 28న ‘శబ్దం’
తాజా మేకర్స్ ‘శబ్దం’ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 28, 2025న తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషలలో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు.
‘వైశాలి’లో ‘వాటర్’ హారర్ ఎలిమెంట్ తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివజగన్ ఈ సినిమాలో ‘సౌండ్’ అనే సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు.
లక్ష్మీ మీనన్ ఈ సినిమాలో హీరోయిన్. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
7G ఫిల్మ్స్ శివ తమిళ చిత్ర పరిశ్రమలో 225 కి పైగా చిత్రాలను పంపిణీ చేసి ద్రౌపతి, రుద్ర తాండవం వంటి చిత్రాలను సహ నిర్మాతగా చేయడం ద్వారా ప్రముఖ స్థానాన్ని కలిగి వుంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడం ద్వారా ఆయన ఇప్పుడు నిర్మాతగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇది ఇప్పటివరకు ఆది కెరీర్‌లో మొదటి భారీ బడ్జెట్ చిత్రం.
ఈ చిత్రం అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడింది, ప్రేక్షకులకు ‘హారర్’ స్టయిల్ లో కొత్త తరహా సినిమా అనుభవాన్ని అందిస్తుంది. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు, ఈ సినిమా ‘సౌండ్’ ఆధారంగా రూపొందినందున, ఈ చిత్రానికి అవుట్ స్టాండింగ్ ఆడియోగ్రఫీని టి ఉదయ్ కుమార్ సమకూర్చారు.
పోస్ట్ ప్రొడక్షన్ పనులుతుది దశకు చేరుకునాయి. ప్రేక్షకులు గొప్ప సినిమాటిక్ అనుభవాన్ని పొందేలా విజువల్ ఎఫెక్ట్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి.
ఈ చిత్రం N సినిమాస్ ద్వారా ఆంధ్ర & తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
తారాగణం: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్, రెడిన్ కింగ్స్లీ, ఎం.ఎస్. భాస్కర్, రాజీవ్ మీనన్
బ్యానర్: 7G ఫిల్మ్స్
నిర్మాత: శివ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: అరుణ్ బత్మనాబన్
స్టంట్‌లు: స్టన్నర్ సామ్
లిరిక్స్: వివేకా
ఎడిటర్: సాబు జోసెఫ్ VJ
ఆర్ట్ డైరెక్టర్ : మనోజ్ కుమార్
కాస్ట్యూమ్ డిజైనర్లు: సోనికా గ్రోవర్/ ప్రదీప
కాస్ట్యూమ్స్: PR గణేష్
మేకప్: షణ్ముగం
PRO: వంశీ శేఖర్
స్టిల్స్: D మనేక్ష
పబ్లిసిటీ డిజైనర్: పవన్
మార్కెటింగ్, ప్రమోషన్లు: DEC
సౌండ్ డిజైన్: సింక్ సినిమా
ఆడియోగ్రఫీ: T ఉదయ్ కుమార్ (Story : ఫిబ్రవరి 28న ‘శబ్దం’ )