యండి మహమ్మద్ కుటుంబానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేయుత
న్యూస్‌తెలుగు/వనపర్తి : పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని 10 వ వార్డుకు చెందిన ఎండి మహమ్మద్ మరణించిన విషయం తెలుసుకొని మాజీ రాజ్యసభ సభ్యులు
రావుల చంద్రశేఖర్ రెడ్డి వారి కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. బిఆర్ఎస్ పెబ్బేరు పట్టణ అధ్యక్షులు వి దిలీప్ కుమార్ రెడ్డి, పెబ్బేరు మండల అధ్యక్షులు వనం రాముల యాదవ్, బిఆర్ఎస్ నాయకులు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రే స్వామి,రాజశేఖర్,మాజీ కౌన్సిలర్ వేణు, సురేష్,అఖిల్, నగదును యండి మహమ్మద్ కుటుంబానికి అందజేశారు. (Story: యండి మహమ్మద్ కుటుంబానికి రావుల చంద్రశేఖర్ రెడ్డి చేయుత)