చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్స
న్యూస్ తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. వివరాల్లోకి వెళితేకూనవరం మండలం, కొండాయి గూడెం గ్రామానికి చెందిన శ్రీమతి మాడకం సింగరమ్మ గత కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నారు , గత సెప్టంబరు-2024 లో భద్రాచలం ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయ్యడం జరిగింది, స్కానింగ్ రిపోర్టులో (ఓవరియన్ సిస్ట్ ) 2.700 కేజీ ల గడ్డ ఉన్నది అని డాక్టర్స్ చెప్పారు. ఆ యొక్క ఆపరేషన్ చెయ్యాలంటే 60-70 వేల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్తోమత లేక అల్లాడుతున్న సమయంలో చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్స్ ఆపరేషన్ చేస్తారని చెప్పడంతో 28.01.25 చింతూరు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ని సంప్రదించారు. డాక్టర్ వారికి అరోగ్య పరీక్షలు చేయించి రిపోర్ట్స్ చూసి వారికి ఎన్టీఆర్ అరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ చెపిస్తానని హామీ ఇచ్చారు . ఈమేరకు మంగళవారం ఎన్టీఆర్ అరోగ్య శ్రీ ద్వారా ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి 2.700 కేజీల గడ్డ ను తొలగించారు . సింగారమ్మ కుటుంబ సభ్యులు డాక్టర్ కోటిరెడ్డి, డాక్టర్ రమణారావు లకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ శస్త్రచికిత్స లో డాక్టర్. కోటిరెడ్డి , డాక్టర్ రమణారావు సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.(Story : చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో అరుదైన శాస్త్ర చికిత్స )