డాక్టర్ జీ. చిన్నారెడ్డి ని కలిసిన గౌరిదేవిపల్లి, నాగపూర్ గ్రామాల రైతులు
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం రేవల్లి మండలం గౌరిదేవిపల్లి, నాగపూర్ గ్రామాలకు చెందిన రైతులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ని కలిసి తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని అందజేశారు. మంగళవారం హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఆ గ్రామాల రైతులు, ప్రజలు చిన్నారెడ్డి ని కలిసి సమస్యలను విన్నవించారు. గతంలో పలు కాలువల నిర్మాణంలో గ్రామానికి చెందిన తమ భూములు ముంపుకు గురయ్యాయని, ప్రస్తుతం డిండి ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో కూడా మిగిలిన భూములు కూడా ముంపుకు గురవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డిండి ప్రాజెక్టు కాలువ నిర్మాణం పనులను ఇతర ప్రాంతాలకు మరలించాలని ఆ గ్రామాల ప్రజలు కోరారు. అందుకు చిన్నారెడ్డి గారు సానుకూలంగా స్పందించారు.(Story : డాక్టర్ జీ. చిన్నారెడ్డి ని కలిసిన గౌరిదేవిపల్లి, నాగపూర్ గ్రామాల రైతులు)