అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
5 లక్షలు రుణం మంజూరు చేయాలి
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ డిమాండ్
370 ఇళ్ల దరఖాస్తులు 18 వార్డు సచివాలయం లో అందజేత
న్యూస్తెలుగు/చింతూరు : గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ కు కేబనెట్ ఆమోదం తెలిపిందని అందులో భాగంగా అర్హత కలిగిన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చెంచు కాలనీ , శింహాచలం నగర్ వార్డుల లో పేద ప్రజలలు ఇంటి స్థలాలఅర్జీలను శించలం నగర్ 18 వ వార్డు సచివాలయంలో అందచేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అక్కినేని వనజ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేదవాళ్లకు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. పేదలు పట్టణ ప్రాంతంలో సొంత ఇళ్లు లేక అద్దె ఇళ్లలో నివసిస్తూ తీవ్ర వ్యవస్థలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం ఇప్పటికే అధిక ధరల భారాలతో ఇబ్బంది పడుతున్న పేదలు ఇంటి అద్దెలు చెల్లించలేక దుర్భర జీవితం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు మాజీ ఎంపీ భరత్ వందలాది మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని కానీ స్థలం చూపించలేదని వారందరికీ స్థలాలు ఇవ్వాలని వనజ డిమాండ్ చేశారు
అనంతరం సారంగధర మెట్ట నుండి క్వారీ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు నగర కార్యదర్శి వి కొండలరావు,సహాయ కార్యదర్శి సప్ప రమణ ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతల పూడి సునీల్, సీపీఐ టౌన్ కమిటీ సభ్యులు టి నాగేశ్వరరావు, పి లావణ్య, ఏ ఐ వై ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు
కొండవతి, వెంకటలక్ష్మి , బేగం తదితరులు పాల్గొన్నారు. (Story : అర్హత కలిగిన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి)