నూతన కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్.ఎస్ కౌన్సిలర్స్ బృందం
న్యూస్‌తెలుగు/వనపర్తి : బి.ఆర్.ఎస్ సీనియర్ కౌన్సిలర్స్ లక్ష్మినారాయణ,బండారు.కృష్ణ ఆధ్వర్యములో బి.ఆర్.ఎస్ కౌన్సిలర్స్ బృందం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లక్ష్మినారాయణ,బండారు.కృష్ణ మాట్లాడుతూ గతములో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నాయకత్వములో పట్టణములో పలు అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ల విస్తరణ,పార్కుల సుందరీకరణ,చెర్వుల మరమతుతో పాటు ఆహ్లాదకరమైన ట్యాంకు బండ్ లు నిర్మించి మున్సిపల్ అభివృద్ధి కోసం కృషి చేశారని అన్నారు. మేము ఎప్పుడు కూడా ప్రజా సమస్యల కోసం,పట్టణ అభివృద్ధి కోసం మీకు సహకరిస్తామని మీరు కూడా గతములో జరిగిన అభివృద్ధికి తోడుగా ప్రజా సమస్యలకు ప్రాధాన్యత ఇచ్చి తోడ్పడాలని కోరారు. రాబోవు వేసవి కాలంలో నీటి ఎద్దడి,కరెంట్ సమస్యలు,పట్టణ పరిశుభ్రత తదితర అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. కమిషనర్ ను కలసిన వారిలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,మాజీ కౌన్సిలర్ కంచె.రవి,కో ఆప్షన్ సభ్యులు ఇమ్రాన్,నాయకులు స్టార్.రహీమ్, నందిమల్ల.రమేష్,ప్రభాకర్,వజ్రాల.రమేష్ తదితరులు ఉన్నారు.(Story : నూతన కమిషనర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన బి.ఆర్.ఎస్ కౌన్సిలర్స్ బృందం)