వేదాలు ఎన్ని ఉన్నా మానవాళికి ఆయుర్వేదమే మిన్న..
శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ మఠం విరూపాక్ష స్వామిజీ ..
న్యూస్‌తెలుగు/చింతూరు : వేదాలు ఎన్ని ఉన్నా కానీ మానవాళికి ఆరోగ్య ప్రధాయు ఆయుర్వేదమే అని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ విరూపాక్ష స్వామీజీ సోమవారం ప్రముఖ ఆయుర్వేద వైద్యులు జమాల్ ఖాన్ను కలుసుకున్న సందర్భంగా అన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని తదుపరి మంత్రోచ్ఛరణ లిఖిత వస్త్రాన్ని జమాల్ ఖాన్ మెడలో వేసినారు. జమాల్ ఖాన్ సేవలను తాను మీడియా మాధ్యమాల ద్వారా చూసి చాలా ఆనందం కలిగిందని మానవసేవయే మనిషికి మాధవ సేవ అని నేటి సమాజంలో వ్యక్తిగత స్వార్థంతో మనిషి తన చుట్టూ వలయం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్నాడని సాటి మానవుడికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం లేదని ఈ సందర్భంగా అన్నారు. మనిషిని మనిషి ప్రేమించటం దయాగుణం కలిగి ఉండటం, దీనుల పట్ల జాలి కరుణ చూపి ఎంతో కొంత వితరణ చేస్తూ తను భూమిపై జన్మించినందుకు ఒక సార్ధకత కలిగి ఉండాలన్నారు. జమాల్ ఖాన్ ప్రజాసేవలో చూశానని ఆయన ఆత్మీయత ప్రేమతో పలకరింపు పేదలకు వెన్ను తట్టి నేనున్నానని ధైర్యం చెప్పే వ్యక్తి జమాల్ ఖాన్ అని అన్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదలకు వృద్ధులకు నిర్వాసితులకు పేదల పెళ్లిళ్లకు పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు అగ్ని ప్రమాద బాధితులకు ఇంటి యజమానులు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకు ఆసరాగా ప్రత్యక్ష దైవముల వెళ్లి ఆర్థిక సహకారం అందించటం చాలా గొప్ప విషయం అన్నారు. తాను ఆయురారోగ్యాలతో జీవిస్తూ మరెందరికో తాను సహాయాలు అందించాలని భగవంతుని కోరుతున్నానని తెలిపారు. (Story : వేదాలు ఎన్ని ఉన్నా మానవాళికి ఆయుర్వేదమే మిన్న..)