ఈనెల 8వ తేదీన బాల బాలికలకు చిత్రకళా పోటీలు
న్యూస్ తెలుగు /వినుకొండ : జెస్టిస్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గ స్థాయిలో బాలబాలికలకు చిత్రకళా పోటీలు ఫిబ్రవరి 8 వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు వినుకొండ విష్ణుకుండిన నగర్ కాల్వ కట్ట ప్రక్కన గల వాసవి హైస్కూల్ లో జరగనున్నాయి. వినుకొండ నియోజకవర్గ స్థాయిలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలలో చదువుతున్న బాలబాలికలకు ఓపెన్ చిత్రకళా పోటీలు నిర్వహించనున్నట్లు అకాడమీ డైరెక్టర్ ఒంగోలు బ్యూలా టీచర్ తెలిపారు. పోటీలలో పాల్గొనే విద్యార్థులు ప్రపంచ శాంతి, దివంగత రాజకీయ నాయకుల, స్వాతంత్ర్య సమర యోధుల చిత్రాలు, సీనరీలు గీయవచ్చు,
వాటర్ కలర్స్, కలర్ పెన్సిల్స్,ఛార్కోల్, మామూలు పెన్సిల్, క్రేయాన్స్ ఉపయోగించి గీయవచ్చు, ఏ4 డ్రాయింగ్ షీట్ అకాడమీ వారు అందజేస్తారు. ఫిబ్రవరి 19 వ తేదీన వినుకొండ వాసవి హైస్కూల్ లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగబోయే చిత్రకళా పండుగ ఆర్ట్ ఎగ్జిబిషన్ లో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు విజేతలకు బహుమతి ప్రదానం ఉంటుంది. మొదటి బహుమతి 2,000 రూపాయలు, మొంటో, ద్వితీయ బహుమతి 1,500 రూపాయల బహుమతి,మెమొంటో, తృతీయ బహుమతి 1,000 రూపాయలు, మెమొంటో, పది గోల్డ్ మెడల్స్, పది సిల్వర్ మెడల్స్, కన్సోలేషన్ బహుమతులు ఉంటాయి. పాల్గొన్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ స్పాట్ లో అందజేయడం జరుగుతుంది. ఫిబ్రవరి నెల ఐదవ తేదీ ఫలితాలు వారి వారి సెల్ ఫోన్ లో అందజేయబడతాయి, జ్యూరీ వారిదే తుది నిర్ణయం. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు (స్క్రూ సినీ నిమిత్తం). బహుమతులు 19 వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు జరుగబోయే సభలో వినుకొండ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జి. వి.ఆంజనేయులు, వారి సతీమణి, శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ చైర్మన్ లీలావతి , తదితరుల చేతులమీదుగా.. అందజేయనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు చిత్రకారుడు డా.వజ్రగిరి జెస్టిస్ సెల్ ఫోన్ 9848469694 కు సంప్రదించాలని తెలిపారు. (sTORY : ఈనెల 8వ తేదీన బాల బాలికలకు చిత్రకళా పోటీలు)