సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో మాదక ద్రవ్యాల పై అవగాహన సదస్సు
న్యూస్‌తెలుగు/విజయనగరం : మాదకద్రవ్యాల వినియోగం, రాగింగ్ మరియు ట్రాఫిక్ నిబంధనలు, ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలపై అవగాహన పెంచేందుకు విజయనగరం ఒకటవ పట్టణ పోలీస్ సిబ్బంది సత్య డిగ్రీ & పీజీ కళాశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఒకటవ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ . శ్రీనివాస విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్యపరమైన, న్యాయపరమైన దుష్పరిణామాలను వివరించి విద్యార్థులతో మాదక ద్రవ్యాల నియంత్రణ పై ప్రతిజ్ఞ చేయించారు. , రాగింగ్ అక్రమ చర్యగా పరిగణించబడుతుందని, దీనికి పాల్పడిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వీటి పరిణామాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా వివరించారు.ఇప్పుడు పెరుగుతున్న రోడ్డుప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్న ఆవశ్యకతను పోలీస్ అధికారులు వివరించారు. ముఖ్యంగా, మద్యం తాగి వాహనం నడపడం తీవ్రంగా నేరమైనదని, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాదు, సమాజానికి కూడా పెను ప్రమాదాన్ని కలిగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా తల్లి తండ్రులు తమ పిల్లల పై పెట్టుకున్న ఆశలను తీర్చాలని దాని కోసం ఒక లక్ష్యం పెట్టుకొని అది నెరవేరెవరకు కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కళశాల ప్రిన్సిపాల్ సాయి దేవమణి ఎస్సై గణేష్ సిబ్బంది, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు. (Story : సత్య డిగ్రీ& పీజీ కళాశాలలో మాదక ద్రవ్యాల పై అవగాహన సదస్సు)