విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్ పంపిణి
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ జిల్లా పరిషత్ మహిళా ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థినీలకు ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వారిచే తయారు చేయబడిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని భావించి వినుకొండ విశ్వ సాయి జూనియర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస్ శర్మ మరియు ప్రిన్సిపాల్ శ్రీవల్లి పావనీలు వారి తండ్రిగారి పేరుమీద నిర్వహిస్తున్న శ్రీ యడవల్లి సత్యనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ హెడ్మాస్టర్ శ్రీ అప్పరాజు నాగేశ్వరరావు గారు మరియు శ్రీ భాగవతుల రవికుమార్ గారు, శ్రీ అప్పరాజు రామారావు గారు, శ్రీ చంద్రశేఖర్ గారు, శ్రీ సిద్ధిక్ మాస్టారు, శ్రీ మస్తాన్ గారు, శ్రీ లింగయ్య గారు, శ్రీ నాగరాజు గారు పాల్గొనగా ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ కే. నాగలక్ష్మి గారు అధ్యక్షత వహించారు వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ఎంతో ఉపకరిస్తుందని విశ్వసాయి జూనియర్ కళాశాల శర్మగారు వారి తండ్రి గారి పేరుతో నిర్వహించే చారిటబుల్ ట్రస్ట్ మరియు విశ్వ సాయి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో యు.టి.ఎఫ్ వారిచే తయారు చేయబడిన ఈ మెటీరియల్ మీకు అందించడం జరుగుతుంది. దీనిద్వారా అత్యుత్తమ మార్కులు మీరు సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించడం జరిగింది అలాగే విశ్వ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ యడవల్లి శ్రీనివాస శర్మ మాట్లాడుతూ ఉన్నతమైనటువంటి విద్యను జ్ఞానాన్ని పొందడం ద్వారా సమాజంలో ఏ దేశం వెళ్లినా కూడా మీకు ప్రత్యేక రాణింపు మరియు గుర్తింపు ఉంటుందని మీ భవిష్యత్తు గురించి ప్రభుత్వం వారు ఎంతో చక్కటి ప్రాంగణంలో మంచి అధ్యాపకులతో మీకు విద్యను అందిస్తూ ఉన్నారు అలాగే మీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎంతో శ్రమతో శ్రద్ధతో పాఠశాలను నిర్వహిస్తూ మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కావున మీ సమయాన్ని వృధా చేయకుండా ఏకాగ్రతగా విద్యను అధ్యయనం చేసి ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినుకొండ ప్రాంత యూ.టి. ఎఫ్ నాయకులు, విశ్వ సాయి జూనియర్ కళాశాల ఫిజిక్స్ ఫ్యాకల్టీ డాక్టర్ కే రామారావు, బయాలజీ ఫ్యాకల్టీ శ్రీమతి డి సుహాసిని మరియు పాఠశాల 10వ తరగతి విద్యార్థినీలు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.(Story : విద్యార్థినీలకు స్టడీ మెటీరియల్ పంపిణి)