Home వార్తలు తెలంగాణ బండలాగుడు పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖరరెడ్డి

బండలాగుడు పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖరరెడ్డి

0

బండలాగుడు పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖరరెడ్డి

న్యూస్‌తెలుగు/వనపర్తి : మూడు రోజులపాటు సాగే పెబ్బేరు చౌడేశ్వరి జాతర ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మాజీ ఎం.పి రావుల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభమయ్యాయి.జాతరలో పాల్గొని చౌడేశ్వరి తల్లి దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డ్ నందు ప్రతి సంవత్సరంలాగానే కొనసాగే అంతః రాష్ట్ర మేలుజాతి జంతు ప్రదర్శన మరియు బందలాగుడు పోటీలను స్వయంగా చెర్నకోల ఊపి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెబ్బేరు సంత నిర్వహణ , చౌడేశ్వరి జాతర నిర్వహణలో రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిందని అన్నారు. రైతులకు ప్రజలకు పశు సంపద ఎంతో ముఖ్యమైనదని మేలుజాతి ఆవులను ఇక్కడ ప్రదర్శించడం హర్షనీయనమని అన్నారు. బండాలాగుడు ప్రదర్శనకు ప్రతి సంవత్సరం బహుమతులు అందజేసి ప్రోత్సహిస్తున్న రావులని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎద్దుల సాయికరుణశ్రీ,కర్రేస్వామి,వనం.రాములు,జగన్నాథం నాయుడు,, అఖిల్ చారీ , దిలీప్ రెడ్డి,ఎం.రాజశేఖర్,మాధవ్ రెడ్డి,, కిషోర్ కుమార్ రెడ్డి, తిరుమలేష్
వడ్డే.రమేష్ తదితరులు పాల్గొన్నారు.(Story : బండలాగుడు పోటీలను ప్రారంభించిన రావుల చంద్రశేఖరరెడ్డి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version