Homeవార్తలుతెలంగాణవెనక్కు తగ్గని నరేంద్ర మోడీ..

వెనక్కు తగ్గని నరేంద్ర మోడీ..

వెనక్కు తగ్గని నరేంద్ర మోడీ..

ప్రజా ప్రతిఘటనే శరణ్యం: సిపిఐ

న్యూస్‌తెలుగు/వ‌న‌ప‌ర్తి : గత పార్లమెంట్ ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితం కావటంతో నరేంద్ర మోడీ సంస్కరణల దూకుడు తగ్గిస్తారని భావించారని, వెనక్కు తగ్గటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాల నరసింహ అన్నారు. గురువారం సిపిఐ కార్యాలయంలో వనపర్తి జిల్లా కార్యవర్గ సమావేశం మోష అధ్యక్షతన జరిగింది. బాల నరసింహ ముఖ్యఅతిథిగా పాల్గొనిముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సొంతంగా మెజార్టీ లేకున్నా జమిలి ఎన్నికలకు చట్టం తెచ్చారన్నారు. వివాదాస్పద వక్ఫ్ బోర్డు చట్టం పై సెలెక్ట్ కమిటీ ఆమోదముద్ర వేసింది అన్నారు. మావోల ప్రభావిత అటవీ ప్రాంతాల్లో ఉన్నగనులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు మావోలను వేటాడి చంపుతున్నారన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానం పైనే వ్యతిరేకత, మనుస్మృతి అమలు చేయాలన్న బలమైన ఆకాంక్షతో ముందుకే వెళుతుందన్నారు. అంబేద్కర్ పై అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ 1947లో స్వాతంత్రం రాలేదని, జనవరి 26 రామ మందిర నిర్మాణం తోనే వచ్చిందన్న ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ వ్యాఖ్యలు దీన్నే సూచిస్తున్నాయన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్ గద్దర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పద్మశ్రీ అవార్డులు బిజెపి పెట్టే బిక్ష కాదని, ఆయా రంగాల్లో నిష్ణాతులకు ప్రతిభ ఆధారంగా ఇచ్చే పురస్కారమన్నారు. ప్రజా చైతన్యానికి గద్దర్ చేసిన సేవలు ఎనలేనివన్నారు. బిజెపి రాజ్యాంగ వ్యతిరేక చర్యలను సమాజం ప్రతిఘటించి పోరాడాలన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ మహా కుంభమేళాలో 30 మంది మృతి 60 మంది గాయపడటం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతికి సంతాపం తెలిపారు. మృతులుఒక్కొక్కరికి రూ. 50 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. భద్రత ఏర్పాట్లు వైఫల్యానికి నైతికబాధ్యత వహించి సీఎం యోగినాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 35 నుంచి 40% మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ కాలేదని వెంటనే అమలు చేయాలన్నారు. ఏదైనా ఒక పథకానికి నిధులను ఆపి అయిన, రైతు భరోసా నిధులు ఏకకాలంలో రైతుల ఖాతాల్లో వేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు సంక్షేమ పథకాలు అర్హులకే ఇవ్వాలని, కాంగ్రెస్ కార్యకర్తలకు ఇస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. గ్రామాల్లో సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రజలను సమీకరించి పోరాడాలి అన్నారు. జిల్లాలో పలు గ్రామాలకు పార్టీని, ప్రజా సంఘాలను విస్తరించాలన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శికె విజయ రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు సీ. ఎన్ శెట్టి, శ్రీరామ్, రమేష్, అబ్రహం, రాబర్ట్, భాస్కర్, శ్రీహరి, గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. (Story : వెనక్కు తగ్గని నరేంద్ర మోడీ..)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics