నీట ముంచి కడదామంటే పోలవరం డ్యామ్..
పోరు బాణాలై గిరిజన బలం చూపుతాం.. పెనుబల్లి మధు మాజీ రాజ్య సభ్యులు
న్యూస్‌తెలుగు/చింతూరు: గిరిజన ముంపు మండలాలను నీటిలో ముంచి పోలవరం డ్యాం కడదామంటే ముంపు ప్రాంత గిరిజనులు పోరు బాణాలై ఎదుర్కొంటారని మాజీ పార్లమెంటు సభ్యులు సిపిఎం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు పోలవరం పోరాట పతాక యాత్ర చింతూరులో సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలవరం నిర్వాసితుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని. గత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో కేవలం ఎకరాకు లక్ష రూపాయలు మాత్రమే పరిహారం అందజేశారని పూర్తిస్థాయిలో పరిహారం ఇవ్వకుండానే నిర్వాసితులకు అన్యాయం చేశారన్నారు. ఆపై వచ్చిన చంద్రబాబు టిడిపి ప్రభుత్వం కూడా నిర్వాసితులకు పునరావాసం పరిహారం పూసే ఎత్తకుండా సోమవారం పోలవరం అంటూ కాలం వెళ్లబుచ్చారని మరలా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చి పోలవరం నిర్వాసితుల ఊసే ఎత్తలేదు అన్నారు. తాతల కాలం నాటి భూమి, ఇల్లు పరిసరాలు ప్రకృతి గిరిజన సాంప్రదాయాలు సాంస్కృతి అన్నిటిని త్యాగం చేసిన ముంపు మండలాల నిర్వాసిత ప్రజానీకానికి అందరికీ ఎకరాకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు బిజెపి నరేంద్ర మోడీని కలుస్తూ కాషాయకరణ చేసే ప్రయత్నంలో ఉన్నాడని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీ వాళ్ ను అవినీతి ఆరోపణలో జైలుకు పంపించి చంద్రబాబు నాయుడుని తెప్పించి కేజ్రీవాల్ ను తిట్టే కార్యక్రమం పెట్టుకున్నాడని ప్రమాదకరమైన బిజెపి దాని అనుబంధం సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అనంతరం గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోతా రామారావు మాట్లాడుతూ దేవీపట్నం లోని గ్రామాలన్నీ ముంపులోకి గురైన కానీ నేటికీ సరైన పునరావాసం పరిహారం అందజేయకుండానే బలవంతంగా నిర్వాసితులను ఖాళీ చేయించారని గత వైసిపి నేడు టిడిపి ప్రభుత్వాలు కూడా కేంద్రంలోని బిజెపి కనుసన్నల్లో మెలుగుతూ నిర్వహితులకు తీరని నష్టం కలిగిస్తున్నారని అందుకే పోలవరం పోరు పతాక యాత్రను సిపిఎం పార్టీ చేపట్టిందన్నారు. ఈ సభకు అధ్యక్షులుగా ఎర్రం శెట్టి శ్రీనివాసరావు వ్యవహరించగా రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సున్నం రాజులు, మర్లపాటి నాగేశ్వరరావు, విఆర్ పురం ఎంపీపీ కారం లక్ష్మి, జిల్లా నాయకులు సోయం చిన్నబాబు, పులి సంతోష్ కుమార్, పోడియం, శ్రీరామ్ మూర్తి, పల్లపు వెంకట్, సీసం సురేష్, మేకల నాగేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి, ఎంపీపీ కొమరం పెంటయ్య, పి .లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.(Story : నీట ముంచి కడదామంటే పోలవరం డ్యామ్)