జనసేన లోకి చేరికలు
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ లో వైసీపీ కి మరో ఎదురుదెబ్బ.. జనసేన లో చేరిన ముఖ్య నాయకుడు, వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజెటి నాగశ్రీను రాయల్ ఆదర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు చేతుల మీదగా వైస్సార్సీపీ సీనియర్ నాయకులు నంది కొండలు కు కండువ కప్పి జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధి పారెళ్ళ అభిమన్యు , శావల్యాపురం మండల అధ్యక్షుడు అడపాల అనిల్ కుమార్ , నూజెండ్ల మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి రజబాబు, బీసీ నాయకుడు తుమ్మ అనిల్ కుమార్ , మండల కార్యదర్శి గణప రమేష్, గ్రామ అధ్యక్షుడు అడపాల చిరంజీవి ,కొంజేటి లక్ష్మణరావు , అశోక్ , తెల్ల మేకల రమేష్, రాజవరపు అనిల్ ,గోపి తదితరు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. (జనసేన లోకి చేరికలు)