చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
న్యూస్‌తెలుగు/చింతూరు : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రత్న మాణిక్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సిపాల్ విద్యార్థినీ, విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్ చే ఆమోదించబడిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమలులోనికి రావడంతో ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎం.శేఖర్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉపయోగించుకుని అభివృద్ది సాధించాలన్నారు. రాజనీతి శాస్త్ర విభాగాధిపతి యస్.అప్పనమ్మ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ సేవలు సక్రమంగా అమలు చేస్తారన్నారు.చరిత్ర విభాగాధిపతి బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ సక్రమంగా అమలు చేస్తున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో అధ్యాపకులు జి.వెంకటరావు,ఆర్.సిహెచ్.నాగేశ్వరావు,డాక్టర్.వై.పద్మ,కె.శకుంతల,కె శ్రీదేవి, కె.శ్రీలక్ష్మి, జి.హరతి,కె.శైలజ,జి.సాయి కుమార్,యన్.రమేష్, రామ్మోహన్ రావు, రాజబాబు,యస్.వి.వి.యస్.యన్. మూర్తి,సంగమం నాయుడు, శీనయ్య, తదితర అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. (Story : చింతూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు)