76వ గణతంత్ర దినోత్సవం
న్యూస్ తెలుగు/వనపర్తి : జిల్లా ఐ డి ఓ సి ఆవరణలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంచిత్ గంగ్వార్ అదనపు కలెక్టర్ రెవెన్యూ జీ వెంకటేశ్వర్లు తో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయనకు కలెక్టర్ అధికారులకు, వనపర్తి జిల్లా ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం లో ఏఓ భాను ప్రకాష్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.(Story : 76వ గణతంత్ర దినోత్సవం )