వినుకొండ తహసిల్దార్ సురేష్ నాయక్ కు ఉత్తమప్రతిభ ఏ.ఈ .ఆర్. ఓ. పురస్కారం
న్యూస్ తెలుగు / వినుకొండ : రాష్ట్ర చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతుల మీదుగా వినుకొండ తహసిల్దార్ సురేష్ నాయక్ కు ఘనంగా సత్కరించి దుశ్యాలతో, మెమొంటోతో ప్రదానం చేశారు. ఈ సందర్బంగా తాహసిల్దార్ సురేష్ నాయక్ కు ప్రముఖులు, తోటి తహసిల్దార్, సహ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం విజయవాడ లో ఉత్తమ అసిస్టెంట్ ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ( ఏఈఆర్ఓ)గా వినుకొండ మండల, పల్నాడు జిల్లా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ చేతుల మీదుగా పురస్కార సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక రెవెన్యూ కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలిపారు. (Story : వినుకొండ తహసిల్దార్ సురేష్ నాయక్ కు ఉత్తమప్రతిభ ఏ.ఈ .ఆర్. ఓ. పురస్కారం)