మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మంచి వారికి అభినందనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : ముగియనున్న మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు కొందరు మంచివారికి మాత్రమే వీడ్కోలు అభినందనలు చెప్తున్నాము. అవినీతిపరులకు రాజకీయ సన్యాసం తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా డిమాండ్ చేశారు. ఐదు సంవత్సరాల క్రితం ఏర్పడిన మున్సిపల్ కౌన్సిల్ ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొనీ అబాసు పాలు అయింది. ఒకడు చెరువు కట్ట తవ్వితే, మరొకడు ప్రభుత్వ భూములు ఆక్రమించుకుంటాడు, ఒకడు మట్టి, అక్రమ ఇసుక అమ్ముతే, మరొకడు మున్సిపల్ పార్కులు, పాత ఆస్తులను అమ్ముకుంటాడు, ఒకడు ప్రజలు కట్టిన టాక్సీ సొమ్మును మింగితే, మరొకడు మున్సిపల్ కాంట్రాక్ట్ లేబర్ లతో కమీషన్లు మింగుతాడు, ఒకడు చెట్లు కొట్టి అమ్ముకుంటే, మరొకడు అక్రమ పర్మిషన్లు ఇప్పించి దండుకున్నారు. ఇలా మున్సిపాలిటీలో 8 మంది అత్యంత అవినీతిపరులుగా, మరొక ఎనిమిది మంది వారికి సహాయకులుగా ఉన్నారు. మిగతావారు కొద్దిమంది మంచిగా సేవ చేశారు, కొద్ది మంది చేతకాక ఊరుకున్నారు. మంచివారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము, వారిని మళ్లీ ఎన్నుకోవాలని ప్రజలకు ప్రజలకు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. గౌనికాడి యాదయ్య, కొత్తగొళ్ల శంకర్, రాజునగరం రవి, శరత్ చంద్ర, వెంకటేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. (Story : మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మంచి వారికి అభినందనలు)