Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌వినుకొండ బాప్టిస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

వినుకొండ బాప్టిస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

వినుకొండ బాప్టిస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం

న్యూస్ తెలుగు/వినుకొండ : బాప్టిస్ట్ ఆస్తులపై కన్నేసిన దళారులు దొంగ డాక్యూమెంట్స్ తో హక్కుదారులమని బుకయిస్తూన్నారు. బుధవారం అర్ధ రాత్రి నరసరావుపేట రోడ్ లోని మిస్సమ్మ బంగ్లా లో ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ సభ్యులు ప్రార్థన పూర్వకంగా ఏర్పాటు చేసిన సిలువను దళారుల ఎంగిలి మెతుకులకు కక్కుర్తి పడిన క్రైస్తవ దొంగల సహకారంతో పవిత్రమైన సిలువను ధ్వసం చెయ్యడం జరిగింది. శుక్రవారం స్థానిక ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ ఆవరణం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణకు న్యాయ సలహాదారుడుగా పని చేస్తున్న న్యాయవాది ఎం.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ. గత 25సంవత్సరా లుగా బాప్టిస్ట్ ఆస్తుల రక్షణ కోసం పని చేస్తున్నానని, అమెరికన్ బాప్టిస్ట్ ఫారిన్ మిషన్ సొసైటీ (అబఫ్మ్స్) ఆస్తులకు లబ్ధిదారులు ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ సంఘాస్తూలు మాత్రమే అని అన్నారు. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ప్రకారం అమ్మకాలు,కొనుగోలులు చేయడానికి ఎవరికి అధికారం లేదన్నారు. నగర నడిబొడ్డున ఉన్నా ఏ. బి. ఎం హైస్కూల్ ఎంతో మంది మేధావులు , గొప్ప వ్యక్తిలను అందించిన చరిత్ర కలిగిన ఏబిఎం హైస్కూల్ ని కూడా అక్రమ మార్గం లో ఆక్రమించుకున్నారన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయడం జరిగిందని, అక్రమ రిజిస్టేషన్లు చేసుకున్న వారు పోజిషన్ లో కూడా లేరని అన్నారు. మున్సిపల్ రిజిస్ట్రేషన్ అధికారులు ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా, రిజిస్ట్రేషన్ చేయకుండా బాప్టిస్ట్ ఆస్తుల పరిరక్షణకు సహాకరించాలని అన్నారు. మద్రాస్ హైకోర్ట్ తీర్పు ప్రకారం ప్రాపర్టీ కస్టోడియన్ అనే వారు ఎవరు లేరని, వారికీ ఎటువంటి హక్కులు లేవన్నారు. పి ఏ బి సి , ఎస్ టి బి సి కి ఆస్తుల మీద సంబంధం లేదని, బాప్టిస్ట్ సంఘాసభ్యులు ప్రతి ఒక్కరు హక్కుదారులే అని అన్నారు. గత ప్రభుత్వం లోను ఆక్రమణ దారులు మిషనరీ స్థలాన్ని ఆక్రమించాలని ప్రయత్నం చేసి విఫలం అయ్యారని, ప్రస్తుత ప్రభుత్వం సహాకరీంచి బాప్టిస్ట్ ఆస్తులని కాపాడాలని కోరారు. సంఘం అధ్యక్షులు రామయ్య మాట్లాడుతూ. మిషనరీలు వందల సంవత్సరాలక్రితం భారత దేశానికి వచ్చి హాస్పిటల్స్, స్కూల్స్, చర్చి లు నిర్మించి సమాజం లో పేదల అభివృద్ధి కి కృషి చేశారన్నారు. సంఘంలో ఉంటూ సంఘానికి వ్యతిరేకంగా పని చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘా కాపరి రెవజె స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ. మిషనరీ ఆస్తుల మీద సర్వ హక్కులు బాప్టిస్ట్ సంఘానికె ఉంటాయని, క్రైస్తవ ఆస్తులను అక్రమ మార్గంలో పొందడంకోసం 27 అడుగుల సిలువను ధ్వంసo చేసిన దుండగులకు కఠిన శిక్ష తప్పదన్నారు.
క్రైస్తవులకి పవిత్రమైన సిలువను ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేసారు. క్రైస్తవుల మనోభావాలపై దెబ్బకొట్టినవారిపై చట్ట పరంగా శిక్షించాలని,త్వరలో అన్ని క్రైస్తవ సంఘాలతో,వినుకొండ లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇమ్మానుయేల్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ కమిటీ సభ్యులు తెలిపారు. క్రైస్తవ సమాజం లో ఉంటు క్రైస్తవ సమాజానికి కీడు చేస్తున్న క్రైస్తవ దొంగలకు తగిన గుణపాఠం తప్పదని కమిటీ వారు హెచ్చరించారు. దీనికి అన్ని మతాల వారు, అన్ని ప్రజా సంఘాల వారు దీనికి మద్దతు తెలుపుతూ…. పార్టీలకి,కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరు క్రైస్తవలకు సహాకారం అందించవలసిందిగా కోరారు. ఈ
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బేతం గాబ్రియేల్, సంఘా సెక్రటరీ జి.ఆశీ వరప్రసాద్, ఉప అధ్యక్షులు డి.నాగస్వామి, జాయింట్ సెక్రటరీ కె.వినోద్ కుమార్, సంఘా పెద్దలు పి. ఫిలిప్, పి.వరప్రసాద్, కె.నాగేశ్వరావు, బి. ఫ్రాన్సిస్, సంఘా యువకులు టీ.జోసెఫ్, ఎం. ఎస్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.(Story : వినుకొండ బాప్టిస్ట్ ఆస్తులను అన్యాక్రాంతం కానివ్వం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!