విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి
ఆధ్వర్యంలో అన్నదానం
న్యూస్ తెలుగు / వినుకొండ : స్థానిక నరసరావుపేట రోడ్డులోని విశ్రాంత ఉద్యోగులసేవా సంఘం వారి ఆధ్వర్యంలో శుక్రవారం విశ్రాంత ఉద్యోగుల సేవ సంఘ భవన ఆవరణలో 200 మంది పేదలకు 83వ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ. ఈ కార్యక్రమంకు కీర్తిశేషులు భువనగిరి లక్ష్మీకాంతం భార్య సత్యవతి కుమారుడు ప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తె శ్రీమతి ఇందిరా దేవి భర్త కృష్ణయ్య సహకారం అందించారని వారి ఆత్మలకు శాంతి చేకూరాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు అవ్వారు కోటేశ్వరరావు ,ఆవుల గోపి నారాయణరావు, రామలింగేశ్వర రావు, సుబ్బయ్య శర్మ, ఎస్. ఎస్.ఎం. శాస్త్రి , ఆది రాములు, హనుమంతరావు, ఏ.వెంకటేశ్వరరావు, ఎం.వి. శర్మ,రాఘవయ్య , దీక్షితులు, శంకరరావు, దుబ్బల దాసు ,తదితరులు పాల్గొన్నారు.(Story : విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో అన్నదానం)