కలెక్టర్ ను కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోరిన జిల్లెల చిన్నారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26న 4 సంక్షేమ పథకాలు అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అందరూ సర్వేలో పాల్గొంటున్నందువల్ల సోమవారం జిల్లా కలెక్టర్ రేట్ లో నిర్వహించే ప్రజావాణి రద్దు చేసిన కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి దగ్గరికి ఫిర్యాదుదారులు రావడంతో వారే స్వయంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి దగ్గరికి తీసుకువెళ్లి ఫిర్యాదుదారుల ఫిర్యాదులను పరిష్కరించాలని కోరగా ఆదర్శ సురభి గారు చాలా ఓపికతో ఫిర్యాదుదారుల ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తాననిఆదర్శ సురభి గారు సానుకూలంగా స్పందించారు. ఫిర్యాదుదారులు సమస్య పరిష్కరించినందుకు కలెక్టర్ ఆదర్శ సురభి కి చిన్నారెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . (Story : కలెక్టర్ ను కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోరిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి)