నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల సాయం అందించిన యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్
న్యూస్‌తెలుగు/ హైదరాబాద్ సినిమా : ఆర్థిక ఇబ్బందులు, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సీనియర్ నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్. ఘట్ కేసర్ లోని ఉషా సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ సొసైటీలో ఆశ్రయం పొందుతోంది పావలా శ్యామల.
ఆమె పరిస్థితి తెలుసుకున్న ఆకాష్ జగన్నాథ్..అక్కడికి వెళ్లి ఆర్థిక సాయం అందించారు. నిస్సహాయ స్థితిలో ఉన్న తనకు సాయం చేసిన ఆకాష్ కు పావలా శ్యామల కృతజ్ఞతలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆకాష్ జగన్నాథ్ మంచి మనసుకు ఈ సాయం నిదర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఆకాష్ తల్వార్ అనే మూవీలో నటిస్తున్నారు. (Story : నటి పావలా శ్యామలకు లక్ష రూపాయల సాయం అందించిన యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్)