Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం

ప్రతి ఇంటికి ప్రభుత్వ పథకం అందాలి

తాటిపాముల గ్రామంలో70 లక్షల వ్యయంతో గ్రామంలో ప్రధాన సిసి రోడ్డు నిర్మాణం

చెరువు కట్ట బలోపేతం పంట కాలువల మరమ్మత్తులకు ప్రత్యేక చర్యలు

న్యూస్ తెలుగు/వనపర్తి  : శ్రీ రంగాపురం మండలం తాటిపాముల గ్రామాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి పరుస్తారని ప్రభుత్వం పరంగా అందజేసే పథకాలను ప్రతి ఇంటికి చేరేలా చూస్తానని వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

18 లక్షల వ్యయంతో గ్రామంలోని పాఠశాలలో నిర్మించే అదనపు గదుల నిర్మాణాలకు ఆయన శనివారం శంకుస్థాపన చేశారు

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల అభివృద్ధి కోసం అనేక పథకాలు చేపట్టిందని RTC బస్సులు మహిళలకు ఉచిత ప్రయాణం, ఉచిత విద్యుత్తు, రుణమాఫీ, 10 లక్షల ఆరోగ్య శ్రీ పథకం, సబ్సిడీ సిలిండర్లు, అనేక పథకాలను అమలు చేసిందన్నారు

జనవరి 26 గణతంత్ర దినోత్సవ నాటి నుంచి మరో నాలుగు పథకాలను అమలు చేస్తున్నామని రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇల్లు లేని నిరుపేదలకు అందరికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని ఎమ్మెల్యే వివరించారు

త్వరలోనే కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకంలో అమలుపరిచే తులం బంగారం, మహిళలకు 2500భృతి , 4000 పెన్షన్ అమలు చేస్తామని ఆయన చెప్పారు

రైతులకు మద్దతు ధర ఇస్తూనే సాగు చేసిన ప్రతి రైతుకు క్వింటాల్ గో 500 బోనస్ను ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు

నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్దజీత గాడిలా పని చేస్తానని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే అని, నేను కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గానే ఉన్నానని, మన పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు కాంగ్రెస్ పార్టీనే అని, రానున్న ఎన్నికల్లో సైతం ప్రతి గ్రామం నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి, ఎంపీపీలను కాంగ్రెస్ పార్టీ వల్లనే గెలిపిస్తే అభివృద్ధి త్వరితగతిన అవుతుందని ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వ్యక్తులను గెలిపించాలని ఆయన సూచించారు.

తాటిపాముల గ్రామ శివారులోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ రాబోతుంది, దాంతోపాటు, నియోజకవర్గానికి స్పోర్ట్స్ స్కూల్ రాబోతుందని ఎమ్మెల్యే చెప్పారు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి PACS దీర్ఘకాలికరణాలు తీసుకున్న రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వన్ టైం సెటిల్మెంట్ OTS వెసులుబాటును కల్పించిందని అన్నదాతలందరూ ఈ సదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు

ఈ సందర్భంగా గ్రామంలో 5లక్షల వ్యయంతో నిర్మించే సిసి రోడ్డు నిర్మాణం పనులు ఆయన ప్రారంభించారు

కార్యక్రమంలో పెబ్బేరు మండల మార్కెట్ చైర్మన్ ప్రమోదిని రెడ్డి, వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రాములు యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు, వైస్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, మాజీ mptc పార్వతమ్మవెంకటయ్యనాయకులు బీరం రాజశేఖర్ రెడ్డి,PACS డైరెక్టర్ వాసుదేవారెడ్డి, తాసిల్దార్, MPDO, పంచాయతీరాజ్ DE కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.(Story : గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందాం )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!