శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న
మాజీ మంత్రి
న్యూస్తెలుగు/ వనపర్తి : స్థానికి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ ఉంగ్లమ్.అలేఖ్య తిరుమల్ ఆహ్వానం మేరకు మాజీ మంత్రి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ధర్మకర్త అయ్యలూరి రఘునాథశర్మ గారు ఆలయ మర్యాదలతో ఆహ్వానించి స్వామి వారి పట్టువస్త్రాన్ని నిరంజన్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరము ప్రజలందరి జీవితాలలో సుఖసంతోషాలు నింపాలి అని ఆకాంక్షించారు. నిరంజన్ రెడ్డి వెంట జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్,చంద్రశేఖర్,వేణు రెడ్డి,యుగంధర్ రెడ్డి,చిట్యాల.రాము తోట. శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. (Story : శ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న మాజీ మంత్రి)