ఘనంగా త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవం
న్యూస్ తెలుగు /వినుకొండ : నాద బ్రహ్మ ప్రముఖ వాగ్గేయ కళాకారులు, నాదోపాసన ద్వారా భగవంతుని చేరిన రామ భక్తులు, కర్ణాటక సంగీత విద్వాంసులు శ్రీశ్రీశ్రీ త్యాగరాజ స్వామి వారి 178 వ ఆరాధన ఉత్సవం, వినుకొండ నిర్వహణలో శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయ ఆవరణలోని శ్రీ త్యాగరాజ స్వామివారి గుడి వద్ద వైభవంగా నిర్వహించారు. ముందుగా ఉదయం శ్రీత్యాగరాజ స్వామివారి ఆలయం నుండి పుట్టాబత్తుని ఆంజనేయస్వామివారి గుడి, మెయిన్ బజార్, బోసు బొమ్మ సెంటర్ వీధుల గుండా పూలమాలతో అలంకరించిన శ్రీరామచంద్ర స్వామి, శ్రీ త్యాగరాజ స్వామి, భరతమాతల చిత్రపటాలను…దేవాలయ ధర్మకర్తలు చందలూరి కొండలు, చందలూరి సుబ్బారావు కుమారులు తాండవ కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు చేతబూనగా.. వివిధ సత్సంగ సభ్యుల, పరిషత్ కార్యకర్తల, భక్తులభజనలు, కీర్తనలతో నగర సంకీర్తన నిర్వహించారు. తదుపరి దేవాలయ అర్చకులు చంటి అభిషేక పూజాదికాలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా త్యాగరాజ స్వామి వారి జీవిత విశేషాలను మరియు ఆలయ నిర్వహణ- ఉత్సవాలు వైభవంగా జరిగే విధంగా ఒక శాశ్వత ప్రణాళిక ఆవశ్యకతను విశ్వహిందూ పరిషత్ పల్నాడు జిల్లా అధ్యక్షులు భాగవతుల రవికుమార్, శంకర సత్సంగం నిర్వాహకులు తెలగంశెట్టి పావని, పట్టణ పురోహితులు ఎడవల్లి శ్రీనివాసశర్మలు వివరించారు. ఈ కార్యక్రమంలో సత్సంగాల నిర్వాహకులు శ్రీమతులు నల్లూరి పద్మ, యక్కల పూర్ణిమ, అడ్డగిరి లక్ష్మీ, పెండ్యాల రాజేశ్వరి, కోట మల్లికార్జున, పరిషత్ కార్యకర్తలు కొలిశెట్టి సుబ్బారావు, భవనాసి సాంబశివరావు, భద్రయ్య, పోలా నరసయ్య, అప్పలరాజ, పోలూరు సత్యనారాయణ, రంగనాయకులు మేడం అశోక్,అరవింద్ తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవం)