Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ విశాఖ ఉక్కు అంత దృఢంగా నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్

విశాఖ ఉక్కు అంత దృఢంగా నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్

0

విశాఖ ఉక్కు అంత దృఢంగా

నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్

న్యూస్ తెలుగు / వినుకొండ : విశాఖ ఉక్కు ఎంత దృఢంగా ఉంటుందో అంతకు మించి బలంగా నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్ ఉండబోతుందని ప్రభుత్వచీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. విశాఖ ఉక్కు , ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని గౌరవిస్తూ కేంద్రం ప్రభుత్వం రూ. 11,440 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించడమే అందుకు నిదర్శనమని హర్షం వ్యక్తం చేశారు. తాజా పరిణామంతో స్టీల్‌ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్న భయాలు కూడా పోయినట్లే అన్నారు. దీని ద్వారా స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని ఎన్నికలకు ముందే ఏదైతే హామీ ఇచ్చామో అది నిలబెట్టుకున్నందుకు మరింత సంతోషంగా ఉందన్నారు. పోలవరం, అమరావతి, పారిశ్రా మిక నడవాలు, ఇప్పుడు విశాఖ ఉక్కుకు వరస ప్యాకేజీలు ప్రకటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్రం రుణపడి ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం, దిల్లీస్థాయిలో ప్ర యత్నాల ఫలితమే ఇదంతా అన్నారు. ఇలాంటి రాష్ట్ర దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకు నే తెలుగుదేశం పార్టీలో ఎన్డీయే కూటమిలో చేరిందని గుర్తు చేశారు. మాజీసీఎం జగన్‌రెడ్డి , ప్రస్తుత సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటనల మధ్య తేడా కూడా ఇదే అన్నారు. గడిచిన అయిదేళ్లు రాష్ట్రంలో అధికారం వెలగబెట్టిన జగన్ 20 సార్లు వరకు దిల్లీ వెళ్లి కప్పిన శాలువాలు, ఇచ్చిన బహుమతుల విలువ మేర కూడా రాష్ట్రానికి నిధులు తేలేక పోయారని ఎద్దేవా చేశారు. కానీ జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్ స్థానిక, దిల్లీ స్థాయిలో భాజపా నేతల్ని సమన్వయం చేసుకుంటూ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తున్నారని, ఇదే విషయంలో ప్రజలందరు కూడా హర్షాతిరేకాలు తెలియజేస్తున్నారని అన్నారు. (Story :విశాఖ ఉక్కు అంత దృఢంగా నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version