భూ సమస్యలను పరిష్కరించుకుందాంగ్రామాభివృద్ధికి పాటుపడదాం
న్యూస్‌తెలుగు/ వనపర్తి : గ్రామాలలో నెలకొన్న భూ సమస్యలన్నింటిని పరిష్కరించుకుందామని రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారానికి నేడు భూభారతి రూపొందించిందని సమస్యలున్న ప్రతి ఒక్కరు స్థానిక తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించుకోవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఖిల్లా ఘణపురం మండలం ఎన్కి తండాలో శుక్రవారం నూతన అంగన్వాడి భవన నిర్మాణానికి గౌరవ ఎమ్మెల్యే గారు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు 40,000 కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన మిషన్ భగీరథ పనుల ద్వారా గ్రామాలలో ఇప్పటికీ తాగునీటి సమస్యలు ఉన్నాయని నేడు ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం నేటికీ మూడు కోట్ల రూపాయల సొంత నిధులు ఖర్చు చేశానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎనికి తాండాలో కొంతమంది రైతుల భూములను ధరణి లో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని కొందరు’ దళారులు సొంతం చేసుకుని ప్రభుత్వ డబ్బులను స్వాహా చేస్తున్నారని అలాంటి వారిపై చట్టపరమైన విచారణ చేపట్టి నిజమైన లబ్ధిదారులకు చెల్లింపులు చేస్తామని ఎమ్మెల్యే గ్రామస్తులకు హామీ ఇచ్చారు. నేటి ఇందిరమ్మ రాజ్యంలో అవినీతికి పాల్పడే వారిని తన్ని తరిమేయాలని ఎవరూ కూడా మీ మీ పనులు చేయించుకునేందుకు లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా నేను కాంగ్రెస్ ఎంపీగా మల్లు రవి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని గ్రామస్థాయిలోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ప్రజా ప్రతినిధులు అయితే అభివృద్ధి తొలి తెగ దిన జరుగుతుందని ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కోరారు
కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ ఎంపిటిసి సభ్యురాలు విజయలక్ష్మి, వెంకట్రావు, నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్,ప్రకాష్, క్యామరాజు విజయ్ కుమార్ రాజు నాయక్ ఆర్య నాయక్ మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : భూ సమస్యలను పరిష్కరించుకుందాంగ్రామాభివృద్ధికి పాటుపడదాం)