అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన
మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు /వినుకొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ లో పేదలకు అందుతున్న ఆహారం నాణ్యత, క్యాంటీన్ నిర్వహణపై దృష్టి సారించాలని మునిసిపల్ కమీషనర్ సుభాష్ చంద్రబోస్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పారిశుధ్యం టోకెన్ విధానం, భోజనం నాణ్యతను పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడి లోటుపాట్లను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులకు పారిశుధ్యంపై పలు సూచనలు చేశారు. అన్నా క్యాంటిన్ పనివేళలపై అక్కడ అందజేస్తున్న టిఫిన్ భోజనం నాణ్యతపై మరియు పారిశుధ్య నిర్వహణపై తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ప్రభుత్వంకు తెలపాలని, తద్వారా నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణంలో అన్నా క్యాంటీన్ నిర్వహణ జిరిగేటట్లు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.(Story : అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ )