గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
న్యూస్‌తెలుగు/ వనపర్తి : ఖిల్లా ఘణపురం మండలంలోని ముందరి తండా, మల్కుమియన్ పల్లి గ్రామాలలో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు శుక్రవారం వనపర్తి ఎమ్మెల్యే గౌరవ శ్రీ తడిమేగా రెడ్డి గారు శంకుస్థాపనలు చేశారు
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులు 20 లక్షలతో ఈ గ్రామపంచాయతీ భవన నిర్మాణాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు
ప్రతి గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉండే విధంగా చూస్తామని గ్రామపంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేయడంతో గ్రామంలో జరిగే ప్రతి కార్యక్రమానికి సంబంధించిన సమావేశాలను సమీక్షలను నిర్వహించుకోవచ్చునని ఎమ్మెల్యే పేర్కొన్నారు
కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు సోలిపురం రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ వెంకటయ్య, మాజీ ఎంపిటిసి సభ్యురాలు విజయలక్ష్మి, వెంకట్రావు, నాయకులు సాయిచరణ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సతీష్,ప్రకాష్, క్యామరాజు, విజయ్ కుమార్, రాజు నాయక్,హా ర్య నాయక్ మండల నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు. (Story : గ్రామపంచాయతీ భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే)