Home వార్తలు తెలంగాణ కొములగట్టు వెంకటేశ్వరస్వామి కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

కొములగట్టు వెంకటేశ్వరస్వామి కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

0

కొములగట్టు వెంకటేశ్వరస్వామి కి

ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

న్యూస్‌తెలుగు/వనపర్తి : పెద్దమందడి మండలం జంగమయ్యపల్లి గ్రామ శివారులో గల కొముల గట్టు వెంకటేశ్వర స్వామి వారికి వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన ఎమ్మెల్యే కి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ కనుమ మరుసటి రోజున కొముల గట్టు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆయన ఆలయన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ సతీష్, సుభాష్ గౌడ్, బాల్ రాజ్, ఆంజనేయులు గౌడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు . (Story : కొములగట్టు వెంకటేశ్వరస్వామి కి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version