Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థలు

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థలు

మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థలు

న్యూస్ తెలుగు /సాలూరు : మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థలు కలిసి పనిచేయడం సమాజానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో సర్వీస్ ప్రొవైడింగ్*మెప్మా మరియు హోం ట్రయాంగిల్ సంయుక్త ఆధ్వర్యంలో సర్వీస్ ప్రొవైడర్స్ నమోదు కార్యక్రమం మరియు సంక్రాంతి సంబరాల్లో ఆమె పాల్గొన్నరు ఈ సందర్భంగా మాట్లాడుతూ మెప్మా పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనకు మరియు సామాజిక సాధికారతకు కీలకంగా పనిచేస్తుందని తెలిపారు. అలాగే, హోం ట్రయాంగిల్ వంటి సేవా రంగ సంస్థలు మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి సహాయపడుతున్నాయని ఆమె పేర్కొన్నారు.ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు, చిన్నతరహా వ్యాపారాలను ప్రోత్సహించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు.గృహ సేవలు, మరమ్మతులు, మరియు ఇతర అవసరాల కోసం వృత్తిపరుల సేవలను అందించడంలో మహిళలకు మద్దతు అందించడమే కుటమి ప్రభుత్వం లక్ష్యం అని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంక్రాంతి సంబరాలు కూడా నిర్వహించారు.. ఇందులో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సాంప్రదాయాలను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగ ఉత్సాహభరిత వాతావరణాన్ని తీసుకురావడంతో పాటు, మహిళల శ్రేయస్సు కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం స్ఫూర్తిదాయకంగా నిలిచింది అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, ఉప్మా పిడి పుష్పాలత తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు హాస్పిటల్ కమిటీ చైర్మన్ వైకుంఠపు హర్షవర్ధన్. మొప్మా కమిటీ సభ్యులు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. (Story : మహిళల ఆర్థిక స్వావలంబన కోసం మెప్మా హోమ్ ట్రయాంగిల్ సంస్థలు)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!