ప్రెషర్ బాంబు పేలి జవాన్ కు గాయాలు
న్యూస్ తెలుగు/చింతూరు : చతిస్గడ్ రాష్ట్రం లోని బీజపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో శనివారం ఉదయం మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు ప్రేలి ఒక జవాన్ కు గాయలయ్యాయి.వివరాల్లోకి వెళితే సి ఆర్ పి యఫ్ 196 బేటాలియన్ కి చెందిన జవాన్ లు శనివారం ఉదయం మహాదేవ్ ఘాట్ నుండి అడవి లోకి కుంబింగ్ కి వెళ్లారు. అడవిలో పోలీస్ జవాన్ లను లక్ష్యం గా చేసుకొని మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబు పై జవాన్ కాలు వేయడం తో ఒక్కసారిగా పేలడం తో జవాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయలైన జవాన్ ను జిల్లా ప్రధాన ఆసుపత్రి కి తరలించి ప్రధమ చికిత్సలు నిర్వహించి మెరుగయిన వైద్యం కోసం రాయపూర్ .తరలించారు.(Story : ప్రెషర్ బాంబు పేలి జవాన్ కు గాయాలు )