రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి
పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు గృహ నిర్మాణాలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేవరకు పోరాటం ఆగదు
సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్
న్యూస్ తెలుగు/ : రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు శుక్రవారం నాడు రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా వినుకొండ పట్టణంలోని తాహసిల్దార్ కార్యాలయం వద్ద ఇళ్ల స్థలాలు లేని నిరుపేదలు వారి వారి ఇంటి స్థలాల కొరకు అర్జీలు తీసుకొని వచ్చి స్థానిక తహసిల్దార్ కి సిపిఐ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అనంతరం సిపిఐ నేతలు మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు వెంటనే పంపిణీ చేయాలని ఇంటి నిర్మాణమునకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్రంలో ఇల్లు లేని ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామాలలో మూడు సెంట్లు ఇస్తానని ఇంటి నిర్మాణమునకు నాలుగు లక్షల రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి వాగ్దానం చేసి ఉన్నారు. కానీ ఇంటి నిర్మాణమునకు ప్రభుత్వం ప్రకటించిన నాలుగు లక్షల రూపాయలు చాలవు ఐదు లక్షలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నదన్నారు. అంతేకాక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ఒకదాని వెంట ఒకటి వెంటనే అమలు చేయాలని ముందుగా తల్లికి వందనం రైతుకు 20,000 మహిళలకు నెలకు 1500 వెంటనే అమలు చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ఎత్తివేయాలని ప్రజలందరూ స్మార్ట్ మీటర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదాని కంపెనీలతో గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న స్మార్ట్ మీటర్ ఒప్పందాలను తెలుగుదేశం నాయకులు కూడా వ్యతిరేకించారని కానీ ఈనాడు స్మార్ట్ మీటర్లను అమలు చేయాలని చూస్తున్నారని ప్రశ్నించిన వారికి మౌనముద్ర సమాధానంగా ఉన్నదని ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అదానీ ల ఒప్పందాలను కాదనలేక, నరేంద్ర మోడీ శిష్యుడిగా ఉన్న అదాని బంధాన్ని వ్యతిరేకించలేక ప్రజల పైన స్మార్ట్ మీటర్ల భారాలను మోపడం అన్యాయమని దీనిని ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు. ఇటీవల పెరిగిన వంట నూనెలు పప్పులు సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయని అధిక ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుపతిలో టోకెన్ల కొరకు జరిగిన తోకేసలాటలో మరణించిన కుటుంబాలకు సంతాపాన్ని తెలుపుతూ వారికి వెంటనే ప్రభుత్వం ఎక్స్రేషియా ఇవ్వాలని హాస్పటల్లో ఉన్న వారికి మెరుగైన వైద్య చికిత్సలు చేయాలని మరొకసారి ఇటువంటి పరిస్థితులు రాకుండా టీటీడీ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు, మాజీ పట్టణ కార్యదర్శి పటాన్ లాల్ ఖాన్, మండల కార్యదర్శులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు,ఎ. పవన్ కుమార్, రాయబారం వందనం, షేక్ కిషోర్, కె. మల్లికార్జున, షేక్ మస్తాన్, జల్లెల వెంకటేశ్వర్లు, శేఖర్ జేబీ షేక్ మస్తాన్ బి దరియ బి , షేక్ కరిమూన్, కాసింబి, రవణమ్మ, కాశమ్మ, పద్మ, లక్ష్మి, లీలావతి, వెంకాయమ్మ తదితరులు మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.(Story : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి )
