గిరిజనుల మహా పాదయాత్ర
న్యూస్ తెలుగు/వనపర్తి : మామిడిమాడ పరిసర తాండలలో సాగుచేసుకుంటున్న 426ఎకరాలు పట్టాలు చేయాలని దాదాపు 24 కిలో మీటర్లు పాదయాత్ర చేసి ఆర్.డి.ఓ కి వినతిపత్రం సమర్పించడం జరిగింది.మాజీ ఎం.పీపీ కృష్ణా నాయక్,తెలంగాణ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్య నాయక్,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల.ఆంజనేయులు గార్ల ఆధ్వర్యములో ఈ పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మాజీ ఎం.పి.పి కృష్ణా నాయక్ మాట్లాడుతూ 150 సంవత్సరాలుగా మేము భూమి సాగు చేసుకుంటున్నామని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక అందజేసి సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని కృషి చేశారని ప్రభుత్వం కూడా సీలింగ్ చట్టం ప్రకారం పట్టాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిన అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వం స్పందించి వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట రాములు ,పుట్ట .ఆంజనేయులు,నందిమల్ల.అశోక్,జాత్రు నాయక్,పద్మ,నిక్సన్,పరమేశ్వర చారి పాల్గొన్నారు.(Story : గిరిజనుల మహా పాదయాత్ర )