సమాజంలో దోపిడి ఉన్నంతకాలం ఎర్రజెండా సజీవం
న్యూస్ తెలుగు/వనపర్తి : సమాజంలో దోపిడీ ఉన్నంతకాలం ఎర్రజెండా సజీవంగా ఉంటుందని పట్టణ సిపిఐ కార్యదర్శి రమేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ అన్నారు. శుక్రవారం వనపర్తి లక్ష్మీనరసింహ కాలనీలో సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో పేరు మారని ఒకే పార్టీ సిపిఐ మాత్రమే ఉన్నారు. దేశంలో ఉన్న తక్కిన పార్టీల పేర్లన్నీ రూపాంతరం చెందాయన్నారు. ప్రధాన పార్టీలు జన సంఘం రూపాంతరం చెంది బిజెపిగా మారిందని, జాతీయ కాంగ్రెస్ రూపాంతరం చెంది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా మారిందన్నారు. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన సిపిఐ వన్నెల తర్వాత కూడా సిపిఐ పేరుతోనే కొనసాగటం విశేషం అన్నారు. అధికారం లేకపోయినా రాజీ లేకుండా ప్రజల పక్షాన పోరాడుతూ వస్తోందన్నారు. సిపిఐ దేశ స్వాతంత్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కోసం, నైజాం కు వ్యతిరేకంగా భూమికోసం భుక్తి కోసం ప్రజల విముక్తి కోసం పోరాటం చేసిందన్నారు. ఈ పోరాటంలో 4500 మంది కామ్రేడ్లు అమరులయ్యారన్నారు. కార్మికులు కర్షకులు తాడిత పీడిత ప్రజల కోసం పనిచేస్తున్న సిపిఐ లో చేరి ప్రజా సమస్యలపై పోరాడాలన్నారు. పోరాటం లేనిదే ఏ మార్పు జరగదు అన్నారు. రైతు రుణమాఫీ ఉచిత కరెంటు పింఛన్లు పక్కా ఇండ్లు ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవన్నీ సిపిఐ పోరాటం వల్లే వచ్చాయన్నారు. సిపిఐ లో చేరి హక్కుల కోసం పోరాడాలని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, నాయకులు ఎత్తం మహేష్,చందు, భూమిక, చిన్నకుర్మయ్య, సునీత, ప్రవళిక, నాగమ్మ, అశోక్,మోహన్ తదితరులు పాల్గొన్నారు.(Story : సమాజంలో దోపిడి ఉన్నంతకాలం ఎర్రజెండా సజీవం )