భక్తులతో ఆలయాలు కిటకిట
న్యూస్ తెలుగు/ సాలూరు : వైకుంఠ ఏకాదశి సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడయి. శుక్రవారం తెల్లవారి నుండి భక్తులు సాలూరు వేగావతి నది ఒడ్డున ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారి దర్శనాలు కల్పించారు.అదేవిధంగా కొంకి వీధి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు భారీ ఎత్తున వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ ఆలయాన్ని పుష్పాలతో దివ్యాంగ సుందరంగా తయారు చేయడం జరిగింది. పెదకోమటి పేట లో ఉన్న శ్రీ సీతారామ ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు అనంతరం భక్తులను దర్శనాలకు అనుమతిచ్చారు. విశేషమైన వైకుంఠ ఏకాదశి రోజు స్వామివార్లను దర్శించుకుంటే భక్తులు కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తులు నమ్మకం కావున ఈరోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. పెదకోమటి పేట సీతారామ ఆలయంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం లో స్వామి వారి పులంగి సేవలు నిర్వహించారు. భక్తులకు ఇటువంటి అసౌక్యం కలగకుండా ఆలయ పూజారులు, ధర్మకర్తలు మండల సభ్యులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.(Story : భక్తులతో ఆలయాలు కిటకిట )