Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా రంగానికి కొత్త రూపునిస్తున్న మంత్రి లోకేష్‌

రాష్ట్ర విద్యా రంగానికి కొత్త రూపునిస్తున్న మంత్రి లోకేష్‌

0

రాష్ట్ర విద్యా రంగానికి కొత్త రూపునిస్తున్న

మంత్రి లోకేష్‌

వినుకొండ నిర్మల పాఠశాలలో సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న జీవీ, మక్కెన

న్యూస్ తెలుగు/ వినుకొండ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచీ రాష్ట్ర విద్యారంగానికి మంత్రి లోకేష్ కొత్తరూపుని ఇస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కొనియాడారు. చదువుతో పాటు ఆటలు, సంపూర్ణ వికాసానికి ప్రాధాన్యత ఇచ్చేలా అనేక సంస్కరణలు తీసుకుని వస్తున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వినుకొండ నిర్మల పాఠశాలలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. బాలికలు వేసిన రంగు రంగుల ముగ్గులను తిలకించారు. విజేతలకు బహుమతులు అందించారు. విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చీఫ్‌ విప్ జీవీ మాట్లాడుతూ. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాలయాల్లో మౌలిక వసతులు, పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని చెప్పారు. విద్యారంగం సమగ్రాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులు కూడా పెంచారని గుర్తు చేశారు. ఇదే సమయంలో చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, ఉన్నత చదువులు చదువుకోవాలని వారికి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయని, విద్యారులు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేదరికం నుంచి ఉన్నత చదువులతో ఉన్నత శిఖరాలకు ఎదగారని, కలాం, ఎన్టీఆర్, లాంటివారు పేద కుటుంబాల నుంచి పైకొచ్చారని, అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఉజ్వల భవిష్యత్తుకు ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులు, పెద్దలు, గురువులను గౌరవించి పూజించాలని, మంచి మంచి ఆశయాలు, భావాలు ఉన్నవారే ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతారని చెప్పారు. అందరూ సేవాభావంతో పనిచేయాలని, తోటివారికి తోడ్పాడాలి, పదిమందికి సాయపడే విధంగా తయారు కావాలని సూచించారు. మన వినుకొండ ప్రాంతంతో పాటు పల్నాడు, రాష్ట్రాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆశించిన విధంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని భగవంతుడిని కోరుకుంటున్నానని, తన ఆశీస్సులు కూడా వారికి అందిస్తున్నానని అన్నారు. (Story : రాష్ట్ర విద్యా రంగానికి కొత్త రూపునిస్తున్న మంత్రి లోకేష్‌)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version