Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌ఆపిల్ ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు 

ఆపిల్ ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు 

ఆపిల్ ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు 

ముత్యాల ముగ్గులు..

సందళ్ళు గొబ్బెమ్మలు..

బోగీ పళ్ళు..

కాంతి ఇచ్చే బోగి మంటలు..

సంప్రదాయాలకు నెలవు..

కేరింతలు కొట్టిన చిన్నారులు..

న్యూస్ తెలుగు /చింతూరు : సంక్రాంతి పండుగ సందడి ముందుగానే వచ్చేసింది. మండపేట ఆపిల్ ప్లే స్కూల్లో గురువారం ముందస్తు సంక్రాంతి సందడి నెలకొంది. చిట్టి పొట్టి చిన్నారులు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు. స్కూల్ కరస్పాండెంట్ బలుసు ప్రజ్ఞ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణ మొత్తం తెలుగు లోగిళ్ళ ను ప్రతిబించేలా అందంగా అలంకరించారు. తోరణాలు కట్టారు. పులతో అలంకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బిక్కిన గోపాల కృష్ణ, బిక్కిన పద్మ, 2 వ వార్డు కౌన్సిలర్ చిట్టురీ సతీష్ , సురేంద్ర సాల్వెంట్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చుండ్రు వెంకట్రావు లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ఆపిల్ ప్లే స్కూల్ లో తెలుగు పండుగల విశిష్టత తెలియజేస్తూ ప్రతి పండుగ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.సమాజం లో మంచి చెడు చెప్పే విధానం లో చిన్నప్పుడే వారికి అవగతం అవుతాయని పేర్కొన్నారు. ప్లే స్కూల్ కరస్పాండెంట్ ప్రజ్ఞ మాట్లాడుతూ గోదావరి జిల్లా లో నిర్వహించే సంక్రాంతి వేడుకలకు ఉన్న ప్రాధాన్యత వివరించారు.సంప్రదాయం లో ఉన్న అన్ని పండుగలను ఆపిల్ స్కూల్ లో మాచిన్నారులకు పరిచయం చేయటంలో భాగంగా ఈ సంక్రాంతి వేడుక ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా కొస్తా జిల్లాలలో ఈ సంక్రాంతి అనేది పండుగల రాణి అనొచ్చన్నారు. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా అంటామన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజే మకర సంక్రాంతిగా జరుపుకుంటామని పేర్కొన్నారు.చిన్నా పెద్దా అనే తేడా లేకుండా, మతాలకు అతీతంగా అందరూ ఆనందంగా జరుపుకునే ఈ సంక్రాంతి ముఖ్యంగా రైతుల పండుగ అని పేర్కొన్నారు.తొలకరి పంట చేతికి అందిన ఆనందంలో ప్రజలందరూ ఆటపాటలతో ఆనందంగా జరుపుకునే   పండుగ అనిపేర్కొన్నారు.కొత్తబట్టలు,పిండివంటలు,బంధువులతో ఉత్సాహంగా జరుపుకునే ఈ సంక్రాంతి ఆనందమయం కావాలన్నారు.భోగిమంటలు,గొబ్బెమ్మలు,రంగవల్లులు,గంగిరెద్దులు,హరిదాసు కీర్తనలు ఇలా ఎన్నెన్నో ప్రత్యేకమన్నారు.అందుకే ఎంతదూరంలో వున్నవారైనా సంక్రాంతికి స్వంత ఊరికి వచ్చి సంక్రాంతి ఉత్సవాలు చేసుకుంటారన్నారు.ఇలాంటి సంక్రాంతి కొంచెం ముందుగానే
ఆపిల్ స్కూల్ లో నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. మరో ముఖ్య అతిథి వార్డు కౌన్సిలర్ చిట్టురీ సతీష్ మాట్లాడుతూ వేడుకలను సంప్రదాయ బద్దంగా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి వేడుకలు ఆరంభించారు. పొంగలి వండి వడ్డించారు. వివిధ రకాల తెలుగు పిండి వంటలు చేసి ప్రదర్శించారు. చిన్నారుల పై రేగు పళ్ళు వేసి ఆశీర్వదించారు.బోగి మంట వెలిగించి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు, దాసరి తిరుమల రావు, ఉపాద్యాయులు సుప్రియ, లౌషిక,హారిక, రోషిణి, మణిపూర్ణ, స్కూల్ వ్యవస్థాపకులు రంగా మాస్టారు తదితరులు పాల్గొన్నారు. (Story : ఆపిల్ ప్లే స్కూల్లో సంక్రాంతి వేడుకలు  )

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!