దేవాలయ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుదాం
మున్సిపల్ కమిషనర్
న్యూస్ తెలుగు / వినుకొండ : పట్టణములోని అన్ని ప్రార్థనా స్థలాల యందు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా పారిశుధ్యం చేయాలని ప్రత్యేక పర్వదినాలలో నిశిత దృష్టితో చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జి వి ఆంజనేయులు సూచన మేరకు హిందువులకు పవిత్రమైన పర్వదినంగా భావించే ఉత్తరాయణ పుణ్యకాల ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు ముఖ్యంగా విష్ణు పంచాయతనం పాటించు వారు వైష్ణవ దేవాలయాల సందర్శన చేయటం రివాజు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పట్టణములోని పురాతనమైన నృసింహ దేవాలయ ప్రాంగణాన్ని కమీషనర్ సుభాష్ చంద్రబోస్ పరిశీలించారు. దేవాలయంలో ఏర్పాట్లను పరిశుద్యమును తదితర అంశాలపై అక్కడి సేవకులతో తెలుసుకున్నారు. అనంతరం అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించి పట్టణంలోని అన్ని దేవాలయాల వద్ద ప్రత్యేక పారిశుధ్యం చేయాలని సంబంధిత అధికారులకు కమీషనర్ కోరారు. (Story :దేవాలయ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుదాం)