చేయూత ఆశ్రమంలో విద్యార్థులతో పుట్టినరోజు వేడుక చేసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి: ప్రతి ఒక్కరి పట్ల ఆప్యాయత అనురాగాలు పంచే ఎమ్మెల్యే మేఘారెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన చేయూత ఆశ్రమ విద్యార్థులు
వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తన పుట్టినరోజు వేడుకలను వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివారులో గల చేయూత అనాధ ఆశ్రమంలో జరుపుకున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి తన సతీమణి శారదా రెడ్డి విద్యార్థులతో కలిసి కేకును కోసి విద్యార్థులకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలను పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ముక్తకంఠంతో ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు చేసిన విద్యార్థులతో ఎమ్మెల్యే సెల్ఫీలు దిగారు. (Story : చేయూత ఆశ్రమంలో విద్యార్థులతో పుట్టినరోజు వేడుక చేసుకున్న వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి)