విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మాట్లాడాలి
విభజన హామీలు అమలు చేయని మోదీ గో బ్యాక్
సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు
మోకాళ్ళుతో రాష్ట్రాన్ని ఆదుకోవాలని చిప్ప పట్టుకుని సీపీఐ వినూత్న నిరసన
న్యూస్ తెలుగు/చింతూరు : విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించాలని బుధవారం న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని రద్దు చేస్తున్నట్లు, అప్పులో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకుంటామని ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్ చేశారు బుధవారం ఉదయం స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మోకాళ్లుతో చిప్ప పట్టుకుని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు అర్ధ గంట పాటు ఆందోళన చేపట్టారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ
జిల్లా కార్యదర్శి తాటిపాక మధు మాట్లాడుతూ … ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌లు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటనలు చేస్తున్నారు కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు, వర్కింగ్ కేపిటల్ ఇవ్వడంలేదన్నారు. పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడవనివ్వడంలేదన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు జీతాలివ్వడంలేదని, నిర్వాసితులకు ఉద్యోగాలివ్వడంలేదని ఆరోపించారు.
ప్లాంట్‌లో 5 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలేదన్నారు. పైగా పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులను తొలగించటానికి యాజమాన్యం పూనుకుంటోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల ప్రకటనలకు, కేంద్ర ప్రభుత్వ చర్యలకు పొంతనలేదని, పూర్తి విరుద్ధంగా వుందన్నారు. కనుక ప్రధాని మోడీ చేత పై అంశాలపై ప్రకటన చేయించాలని మధు డిమాండ్ చేశారు. (Story : విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని మాట్లాడాలి)