సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు
న్యూస్ తెలుగు / వినుకొండ : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వినుకొండ డిపో నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చెయ్యడం జరిగిందని ఆర్టీసీ డిపో మేనేజరు జే. నాగేశ్వరరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని, 10న తేదీనుండి ఎక్స్ ప్రెస్ బస్సులు సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్ప్రెస్ సర్వీసులు మొత్తం పది సర్వీసులు పెడతామని అవసరాన్ని బట్టి సర్వీసులు పెంచుతామని ఆయన తెలిపారు. వినుకొండ నుండి హైదరాబాదు కు నడుపుతున్నామని ఈ అవకాశాన్ని వినుకొండ నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజరు తెలిపారు. (Story : సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు)