నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో
డైరీలు పంపిణీ
న్యూస్ తెలుగు/ వినుకొండ : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ,వినుకొండ మరియు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వినుకొండ నందు ఎన్ టి ఏ రాష్ట్ర డైరీ మరియు క్యాలెండర్ ను పాఠశాలల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కె.నాగలక్ష్మి మరియు హవీలా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయుల బదిలీల చట్టం రూపొందించేటప్పుడు కనిష్ట సర్వీసును రెండు అకడమిక్ సంవత్సరాలుగా, గరిష్ట సర్వీస్ 8 అకడమిక్ సంవత్సరాలుగా పరిగణిస్తే ఎక్కువమందికి బదిలీకి అవకాశం ఉంటుందని, ప్రభుత్వానికి ఎన్. టి. ఏ తరఫున విజ్ఞప్తి చేశారు. దీని వలన వివిధ హోదాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 2023 లో ప్రమోషన్ పొందిన గజిటెడ్ ప్రధానోపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుందని, ఈ సందర్భంగా ఎన్ టి ఏ రాష్ట్ర అదన ప్రధాన కార్యదర్శి బెజవాడ వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ టి ఏ జిల్లా కౌన్సిలర్ సిహెచ్ . రమేష్, ఎన్ టి ఏ రాష్ట్ర కౌన్సిలర్ ఊటుకూరి శ్రీకృష్ణ, ఎన్ టి ఏ కార్యవర్గ సభ్యులు రామకోటేశ్వరరావు మరియు సీనియర్ ఉపాధ్యాయులు బి.మారుతి ,ఏ. ప్రమీల ,శ్రీమతి అనిత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. (Story : నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీలు పంపిణీ)