ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోవాలి
న్యూస్‌తెలుగు/విజయనగరం : ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖలో పాల్గొనే బహిరంగ సభ చరిత్రలో నిలిచిపోయేలా, యావత్ దేశం ఏపీ వైపు చూసేలా విజయవంతం చేయాలని జనసేన నేత గురాన అయ్యలు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియా తో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ప్రధాని ఏపీ వస్తున్నారని, ఇదొక చరిత్రాత్మక పర్యటన అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి పర్యటన రాష్ట్రానికి ఎంతో కీలకం అని, రాష్ట్ర భవిష్యత్ ఈ పర్యటనపై ఆధారపడి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ అధిక నిధులు కేటాయిస్తోందని, అభివృద్ధి ప్రాజెక్టులు చేపడుతోందని, మోదీ సభ, రోడ్ షో లను విజయవంతం చేయడం ద్వారా దానికి కృతజ్ఞతలు తెలపాలన్నారు. (Story : ప్రధాని మోదీ సభ చరిత్రలో నిలిచిపోవాలి)
